భద్రాద్రి జిల్లాలో పల్స్ పోలియోకు భారీ ఏర్పాట్లు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పల్స్ పోలియో (Pulse Polio) కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ పక్కా ప్రణాళికతో సర్వం సిద్ధం చేసింది. 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల 98,818 మంది చిన్నారులకు వంద శాతం పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా భారీ వ్యూహాన్ని రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా 925 పోలియో బూత్‌లను ఏర్పాటు చేయగా, ప్రయాణాలలో ఉండే చిన్నారుల కోసం బస్టాండ్‌లు , రైల్వే స్టేషన్‌లు  వంటి రద్దీ ప్రాంతాలలో 38 ట్రాన్సిట్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 1,001 ప్రత్యేక టీములను రంగంలోకి దించుతున్నారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు (Pulse Polio) అందించాలనే లక్ష్యంతో సిబ్బంది పనిచేస్తున్నారు. జూన్ 28 నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంపై డీఎంహెచ్‌ఓ డా. తుకారాం రాథోడ్ జిల్లా వైద్యాధికారులతో జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని, ఎవరూ మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పల్స్ పోలియోను వంద శాతం విజయవంతం చేయడంతో పాటు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను బాధ్యతగా అమలు చేయాలని  వైద్య సిబ్బందికి సూచించారు.

Read Also: అమ్రాబాద్ ఫారెస్ట్‌లో ఎన్ని పులులు ఉన్నాయంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>