Mobile Popup Ad
Mobile Popup Ad

జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరికి బెయిల్

కలం, వెబ్ డెస్క్ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో మీడియా వ్యవహారాలు చూసిన సీపీఆర్వో, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా  ఉన్న పూడి శ్రీహరి (Pudi Srihari)కి బెయిల్ మంజూరు అయింది. బుధవారం పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. పూడి శ్రీహరి ఆచూకీ కనబడడం లేదని పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. అయితే దాదాపు 33 గంటల తర్వాత పూడి శ్రీహరిని కుప్పం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే కుప్పం కోర్టు పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.

కాగా, సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల పెట్టించారనే ఆరోపణలపై పూడి శ్రీహరిపై చిత్తూరులో కేసులో నమోదైంది. దీంతో బుధవారం ఉదయం జగన్ ను కలిసి ఇంటికి వెళ్తున్న ఆయన్ని పోలీసులు మధ్యలోనే  అడ్డగించి తమతో పాటు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే శ్రీహరి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకోవడమే కాక ఆయన ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే  శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపి ఆరోపించింది. సీనియర్ జర్నలిస్ట్ అయిన జగన్ సీపీఆర్వో పూడి శ్రీహరిని ఇలా ఉగ్రవాదిలా ఆరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వెఎస్సార్సీపీ మాజీ మంత్రులు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసనలు వెలువెత్తిన వేళ గురువారం కుప్పం కోర్టులో శ్రీహరిని పోలీసులు హాజరుపరిచారు. దీంతో వాదనలు విన్న న్యాయస్థానం.. ఆయనకు  బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>