Mobile Popup Ad
Mobile Popup Ad

డికాక్ సెంచరీ.. పంజాబ్ టార్గెట్ 196

కలం, వెబ్ డెస్క్: ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ మరోసారి తన పంజా విసిరింది. పంజాబ్ బౌలర్ల దెబ్బకు ముంబై ముక్కీ మూలిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి195 పరుగుల చేసింది ముంబై (Mumbai Indians). దీంతో పంజాబ్ ముందు 196 పరుగుల లక్ష్యం నిలిచింది. డీకాక్ మాత్రం తన మార్క్ బ్యాటింగ్‌తో గ్రౌండ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (112 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 60 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ బాది జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆరంభంలోనే రిక్లెటన్, సూర్యకుమార్ యాదవ్ వికెట్లను కోల్పోయి ముంబై కష్టాల్లో పడినా, డికాక్‌కు నమన్ ధీర్ (50) తోడవ్వడంతో ఇన్నింగ్స్ ఊపందుకుంది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 122 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో హార్దిక్ పాండ్యా (14), తిలక్ వర్మ (8) మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా, మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ చెరో వికెట్ తీశారు.

ముంబై (Mumbai Indians) ఇన్నింగ్స్‌లో క్వింటన్ డికాక్ 186.66 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 112 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యువ బ్యాటర్ నమన్ ధీర్ 31 బంతుల్లో 50 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి అతనికి చక్కని సహకారం అందించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 14 పరుగులు చేయగా, తిలక్ వర్మ 3 బంతుల్లోనే 2 ఫోర్లతో 8 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. ఓపెనర్ రిక్లెటన్ (2), స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (0), రూథర్‌ఫోర్డ్ (1) నిరాశపరిచారు. ముంబైకి ఎక్స్‌ట్రాల రూపంలో 8 పరుగులు లభించాయి. మొత్తంగా 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 195/6.

పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ అత్యంత ప్రభావవంతంగా బౌలింగ్ చేశాడు. తన 4 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు (రిక్లెటన్, సూర్యకుమార్, రూథర్‌ఫోర్డ్) పడగొట్టాడు. మార్కో జాన్సెన్ 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి హార్దిక్ పాండ్యా వికెట్ తీశాడు. పార్ట్ టైమ్ బౌలర్ శశాంక్ సింగ్ 2 ఓవర్లలో 19 పరుగులిచ్చి హాఫ్ సెంచరీ చేసిన నమన్ ధీర్‌ను పెవిలియన్ పంపాడు. ఎక్స్‌పియెన్స్డ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు; అతను తన 3 ఓవర్లలో ఏకంగా 45 పరుగులిచ్చాడు. విజేకుమార్ వైశాక్ 3 ఓవర్లలో 36 పరుగులు, జేవియర్ బార్ట్లెట్ 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>