వైఎస్ జగన్ CPRO పూడి శ్రీహరి మళ్లీ అరెస్ట్

కలం, వెబ్ డెస్క్ : జగన్ మాజీ సీపీఆర్‌వో, వైసీపీ నేత పూడి శ్రీహరి (Pudi Srihari) మళ్లీ అరెస్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారన్న కేసులో కుప్పం కోర్టు పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. దీంతో కోర్టు నుంచి బెయిల్ పై బయటకు రాగానే పూడి శ్రీహరిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మరో నోటీసులిచ్చి ఆయన్ని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

పూడి శ్రీహరిపై (Pudi Srihari) కక్ష్య సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం దిగిందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన పూడి శ్రీహరికి కుప్పం కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసిన కూడా మళ్లీ అరెస్ట్ చేయడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలకు దిగితే రాబోయే జగన్ సర్కార్ హయాంలో ఊహించని పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని అంబటి రాంబాబు వంటి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పూడి శ్రీహరిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: సజ్జల

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>