Mobile Popup Ad
Mobile Popup Ad

‘వెంటనే కూల్చేయాలి’.. హైడ్రా బిగ్ అలర్ట్!

కలం, వెబ్‌ డెస్క్: బెంగళూరులో భారీ వర్షాలకు పురాతన భవనం కూలి ఏడుగురు చనిపోవడంతో హైడ్రా (HYDRAA) అప్రమత్తమైంది. ఇళ్లు, జ‌న సంచారం ఉన్న ప్రాంతాల్లో శిథిలావ‌స్థ‌లో ఉన్న నిర్మాణాలుంటే వెంటనే 9000113667కు స‌మాచారం అందించాల‌ని కోరింది. కూల‌డానికి సిద్ధంగా ఉన్న పురాత‌న భ‌వ‌నాల‌ను ముందే గుర్తించి భ‌ద్రంగా కూల్చేస్తే భారీ ప్రమాదం తప్పే అవకాశం ఉందని పేర్కొంది. ఈ విషయంలో ఇప్ప‌టికే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల నుంచి కూడా స‌మాచారం తీసుకుంటున్నామ‌ని పేర్కొంది.

ప్రజా భాగస్వామ్యమే కీలకం..

పురాతన కట్టడాలు, కూలేందుకు సిద్ధంగా ఉన్న నిర్మాణాల వివరాలు తమకు అందించే కార్యక్రమంలో ప్ర‌జ‌లు కూడా భాగ‌స్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. అలాంటి కట్టడం ఏ ప్రాంతంలో ఉంది… ఫొటో, లొకేష‌న్‌ను తమ వాట్సాప్ నెంబరుకి షేర్ చేస్తే వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హైడ్రా (HYDRAA) తెలిపింది. అలాంటి వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. అకాల వ‌ర్షాలు ప‌డుతున్న వేళ ఎప్పుడైనా ప్ర‌మాదం ఉంటుంద‌ని గ్ర‌హించి స‌మాచారం ఇవ్వాల‌ని కోరింది.

Read Also: తెలంగాణకు మోదీ రాక.. రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>