భారీ వర్షాలు.. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల (Mahabubnagar Rains) దృష్ట్యా, ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ (Control Room) ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) తెలిపారు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబరు 08542 241165 ను సంప్రదించి సహాయం పొందవచ్చని తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లా ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబరు 08542 241165 ను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. మూడు షిఫ్ట్ లలో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ సిబ్బంది అందుబాటులో ఉండి, ప్రజల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరిస్తారని వివరించారు. వర్షాలు, వరదల వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే, పై కంట్రోల్ రూమ్ నంబరుకు సంప్రదించి సహాయం పొందవచ్చని కలెక్టర్ ఈ ప్రకటనలో తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>