Mobile Popup Ad
Mobile Popup Ad

కేబీఆర్ పార్క్ వద్ద ప్రకృతి ప్రేమికుల ఆందోళన

కలం, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ (KBR Park) వద్ద ప్రకృతి ప్రేమికులు ఆందోళన చేపట్టారు. పార్క్ చుట్టూ నిర్మించే ఫ్లైఓవర్ వల్ల వేలాది చెట్లు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల జంతువులు, పక్షులకు ఇబ్బంది కలుగుతుందని నిరసన వ్యక్తం చేశారు. కోర్టులు చెప్తున్నా ప్రభుత్వం వినిపించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణం ఆపకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని ప్రకృతి ప్రేమికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా, కేబీఆర్ పార్క్ చుట్టూ రూ. 1,090 కోట్ల వ్యయంతో ఏడు స్టీల్ ఫ్లైఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ నిర్మాణ పనులు జరుగుతన్న విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>