కలం, వెబ్ డెస్క్ : భారత్ విదేశాంగ విధానం పూర్తిగా విఫలమయిందని వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీవ్ర ఆరోపణలు చేశారు. రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ చోర్ – గద్దీ చోడ్’ (Vote Chore – Gaddi Chode) దర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) దర్నాలో మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయిందన్నారు. దేశంలోని ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, దానికి కారణం బీజేపీయేనని ఆరోపించారు. డాలర్ విలువ 90 రూపాయలకు చేరుకుందని.. నిరుద్యోగం, ద్రవ్యోల్భణంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పేపర్ లీకుల కారణంగా యువత ఉద్యోగాల్లో నష్టపోతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు.
Read Also: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్
Follow Us On: Instagram


