epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

కలం, నల్లగొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MG University) పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వీసీ ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం యూనివర్సిటీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వహణ, ప్రణాళిక బద్ధంగా పారదర్శకంగా నిర్వహించి ఆదర్శంగా నిలవాలన్నారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ లో 8295 మంది విద్యార్థులు హాజరుకాగా 1806 మంది (21.77%), మూడవ సెమిస్టర్ లో ఐదు ఎనిమిది మూడు నాలుగు మందికి గాను 1569 (26.89%), ఐదవ సెమిస్టర్ లో 5586 మందికి గాను 2109 మందికి (37.76%) Degree Semester Results లో ఉత్తీర్ణత సాధించినట్లు సీఈఓ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు.

రివాల్యుయేషన్ కోసం జనవరి 22వ తేదీ లోపు, ప్రతి సబ్జెక్టుకు రూ.200 రుసుము చెల్లించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, , ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆకుల రవి, అధికారులు డాక్టర్ లక్ష్మి ప్రభ, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ ప్రవళిక,  డాక్టర్ బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

MG University
MG University

Read Also: యాదగిరిగుట్టలో గూడుపుఠాణీ.. ఆల‌యంలో ఏం జ‌రుగుతోంది!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>