Mobile Popup Ad
Mobile Popup Ad

రవితేజ “ఇరుముడి” స్పెషల్ పోస్టర్ వచ్చేసింది..

కలం, సినిమా : మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) గత కొంతకాలంగా వరుస మాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా వర్కౌట్ కాకపోవడంతో ఈ సారి రూటు మార్చి డీవోషనల్ కథాంశంతో ప్రేక్షకులను పలుకరించనున్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” ఇరుముడి”(Irumudi). టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

మజిలీ సినిమా తరువాత ఆ రేంజ్ హిట్ లేని శివ నిర్వాణ ఈ సారి రవితేజ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మైత్రి మూవీ మకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ రవితేజ భార్యగా నటిస్తుంది. బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో నటిస్తుంది. యంగ్ మ్యూజిక్ సెన్సెషన్  జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ  ప్రేమతో ముడిపడిన చురుకైన తండ్రి, అందమైన కుమార్తె కథే ఇరుముడి సినిమా అని ట్వీట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>