epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అందుకే పెళ్లి చేసుకోలేదు.. క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!

కలం, వెబ్​ డెస్క్​ : టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎప్పుడు? – ఇది గత దశాబ్ద కాలంగా సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ నిరంతరం వినిపించే ప్రశ్న. తాజాగా తన రాబోయే చిత్రం ‘రాజా సాబ్’ (Raja Saab) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఈ ప్రశ్నపై స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈవెంట్ జరుగుతున్న సమయంలో గ్యాలరీలో ఉన్న ఓ అభిమాని పట్టుకున్న ప్లకార్డు అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై ‘ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్​ ఏమిటి..?’ అని రాసి ఉంది. దీనిని గమనించిన యాంకర్ సుమ, వెంటనే ఆ ప్రశ్నను ప్రభాస్ ముందు ఉంచారు.

పెళ్లి గురించి ప్రశ్న ఎదురవ్వగానే ప్రభాస్ (Prabhas) నవ్వుతూ.. చాలా సాఫీగా సమాధానమిచ్చారు. ‘అదే ఏంటో తెలియక కదా.. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. ప్రభాస్ ఇచ్చిన ఈ సమాధానంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. తన పెళ్లిపై వస్తున్న గాసిప్స్ గురించి పెద్దగా పట్టించుకోని ప్రభాస్, ఈసారి చాలా స్పోర్టివ్‌గా సమాధానమిచ్చి అభిమానులను ఖుషీ చేశారు.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హారర్-కామెడీ జోనర్‌లో రాబోతోంది. ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పెళ్లి గురించి ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also: ఏఐ అసభ్యకర ఫొటోలు.. కోర్టుకెక్కిన సెలబ్రిటీలు వీరే..

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>