epaper
Sunday, February 22, 2026
epaper

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సంచలన మూవీ షూట్ స్టార్ట్..!

కలం, డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే స్పిరిట్ మూవీ షూట్ స్టార్ట్ అయింది. అంతకు ముందే ఫౌజీ మూవీ షూటింగ్ కూడా నడుస్తోంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న కల్కీ-2 (Kalki 2) షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్ అయింది కాబట్టి.. రెండో పార్ట్ అంతకు మించి ఉండొచ్చని అంచనాలు పెంచేసుకుంటున్నారు.

తాజాగా హైదరాబాద్ లోని శంకర్ ప్లలి పరిసరాల్లో వేసిన భారీ సెట్స్ లో సైలెంట్ గా షూట్ స్టార్ట్ చేశారంట. ఇందులో కమల్ హాసన్ (Kamal Haasan), అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారని తెలుస్తోంది. వీరిద్దరిపై కీలక సన్నివేశాలు ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. త్వరలోనే ఇందులో ప్రభాస్ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం స్పిరిట్ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ప్రభాస్ పాత్రకు సంబంధించి కీలక షెడ్యూల్ అయిపోగానే.. ఆ లుక్ నుంచి కల్కి-2 (Kalki 2) లుక్ లోకి ప్రభాస్ మారుతాడని అంటున్నారు.

ఈ సినిమా నుంచి దీపిక పదుకొణెను తీసేసిన సంగతి తెలిసిందే. సుమతి పాత్ర కోసం చాలా మంది హీరోయిన్ల లుక్ ను టెస్ట్ చేశారంట. చివరకు సాయిపల్లవిని ఓకే చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దానిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. రెండో పార్టు మొత్తం పురాణాల ఆధారంగా జరగబోతోంది. ఎక్కువగా కర్ణుడి పాత్రను చూపించే ఛాన్స్ ఉంది అంటున్నారు.

Read Also: ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్.. ‘వారణాసి’ గ్లింప్స్ తో డబుల్ ట్రీట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>