కలం, వెబ్ డెస్క్: శాసన మండలిలో రవాణా శాఖ అభివృద్ధికి సంబంధించిన విషయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సుదీర్ఘంగా వివరించారు. రవాణా శాఖలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్‌ల ఏర్పాటుపై ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైందని చెప్పారు. 30.09.2024 టిఆర్&బి శాఖ జీవో నం.28 ద్వారా పరిపాలన అనుమతులు ఇవ్వడమైందని స్పష్టం చేశారు.
ఈ ఏటీఎస్‌ల ప్రక్రియ ప్రస్తుతం తుదిదశలో ఉందన్నారు. ఇవి పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తాయని.. ఇందులో ఎటువంటి ప్రైవేట్ యాజమాన్యం ఉండదన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పాత వాహనాలపై గ్రీన్ టాక్స్ రూ.68.11 కోట్లు అని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.71.14 కోట్లు గ్రీన్ టాక్స్ ద్వారా వచ్చిన నిధులను ఈ శాఖ ఉపయోగించినప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు 100 శాతం పన్ను మినహాయింపులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం స్క్రాపేజీ పాలసీని విజయవంతంగా అమలు చేస్తుందని మంత్రి పొన్నం (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రిజిస్టర్ వెహికల్స్ స్క్రాపింగ్ సౌకర్యాలు ఉన్నాయన్నారు. పాత వాహనంలో స్క్రాపింగ్ ను ప్రోత్సహించడానికి లయబిలిటీల మాఫీని, పన్ను రాయితీలను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ఏటిఎస్‌లు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని నడుస్తుందని.. ప్రైవేట్‌కి సంబంధం ఉండదని చెప్పారు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మాదిరీ ప్రమాణ శాఖకు పాప గ్రహణం పోయిందన్నారు. రవాణా శాఖలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 50 కి పైగా సంస్కరణలు అమలు చేశామని స్పష్టం చేశారు. రవాణా శాఖలో ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ తీసుకొస్తున్నామని.. డ్రైవింగ్ లైసెన్సులు పారదర్శకత్వం ఉండడం కోసం నూతన టెక్నాలజీ ద్వారా దీనిని వినియోగిస్తామన్నారు.
గత 10 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం వాహన సారధిలో చేరలేదని పొన్నం వివరించారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు చేరినప్పుడు తెలంగాణ ఎందుకు చేరలేదు? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. అది గమనించి వెంటనే వాహన సారథిలో చేరామని.. తమ ప్రభుత్వం ఏర్పడగానే సారధి పోర్టల్‌లో చేరామన్నారు. ఈనెల 23వ తేదీ నుండి వాహన్‌లో చేరుతామన్నారు. మాన్యువల్‌గా టెస్టింగ్ ఇవ్వడానికి ఎన్ఓసీ (NOC) ఇవ్వడానికి ఇబ్బంది లేదని.. కేంద్రం నుండి అనుమతులు తీసుకున్నామన్నారు. రవాణా శాఖలో పూర్తి స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. శాఖ కార్యాలయాల్లో ఇబ్బందులు లేకుండా ఉండడానికి షోరూమ్‌లలోనే వాహన రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించామని చెప్పారు. TS నుండి TG తెచ్చామని.. రవాణా శాఖకు లోగో తెచ్చామన్నారు.
రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రోడ్ సేఫ్టీపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని.. డ్రైవర్లకు అత్యంత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీలో నియామకం అవుతున్న డ్రైవర్లకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఆరు నెలలపాటు ట్రైనింగ్ ఇచ్చి ఆర్టీసీలోకి తీసుకుంటున్నామని వివరించారు. స్క్రాప్ పాలసీ అమలు చేస్తున్నామని.. స్క్రాప్ పాలసీలో వాహనాలు ఇచ్చినప్పుడు ఇంటెన్సివ్ ఇస్తున్నామన్నారు. స్థలాల సేకరణను బట్టి మొదటి దశలో 15, రెండవ దశలో 22 ఏటీఎస్(ATS)లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సిటీ ఎంట్రన్స్‌లో వాహనాల పార్కింగ్ స్థలాలు ఇస్తే రవాణా శాఖ నుండి పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Read Also: 2029లో తెలంగాణ ఎలక్షన్స్.. కాంగ్రెస్‌కు ప్లస్ అయ్యేనా?
Follow Us On : WhatsApp

