కలం, వెబ్ డెస్క్: ఏపీలో మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాన్ని సీఎం చంద్రబాబు (Chandrababu) బుధవారం ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమానికి కీలకమైన ‘దివ్యాంగ శక్తి’ (Divyang Shakti) పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి సీఎం లాంచ్ చేశారు. దీంతో నేటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు.
మంగళగిరి నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రయాణించారు. ఈ పథకం ద్వారా ముఖ్యంగా 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారు బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఇప్పటికే అమలులో ఉన్న 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే కాకుండా.. ఇప్పుడు 21 వర్గాల దివ్యాంగులకు ఈ పథకాన్ని విస్తరించారు. దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకులకు కూడా ప్రభుత్వం చేయూతనందించింది. వారికి బస్సు చార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వనుంది. ఈ స్కీం ద్వారా రాష్ట్రంలోని మొత్తం 12.76 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులకు లబ్ది చేకూరనుంది.

