Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్ ను గ్రీనరీగా మారుస్తాం : పొన్నం ప్రభాకర్

కలం, వెబ్ డెస్క్ : 150 డివిజన్ లలో 25 లక్షల మొక్కలు నాటేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నామని, హైదరాబాద్ గ్రీనరీగా మారుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ ఎంసీ అధికారులతో పొన్నం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాకాలంలో సమస్యలు ఏర్పడ్డప్పుడు అన్ని డిపార్ట్‌మెంట్ లు సమన్వయం చేసుకొని పనిచేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న అన్ని బస్తీ దవాఖానాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

భవనాల నిర్మాణాలు జరిగినప్పుడే వాటర్ హార్వెస్టింగ్ తప్పకుండా చేయాలని.. ఈ అంశంపై ప్రజలకు ముందు అవగాహన కల్పించి తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్ చేస్తాం అని మంత్రి పొన్నం తెలిపారు. హైదరాబాద్ ప్రజలు అంత అపార్ట్‌మెంట్ , గేటెడ్ కమ్యూనిటీ లలో హార్వెస్టింగ్ కచ్చితంగా చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో మహిళలు మహిళా సంఘాల్లో చేరాలి అని కోరారు. సున్నా వడ్డీ రుణాలు ఉపయోగించుకోవాలని పొన్నం సూచించారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ మహిళా సంఘాల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్బన్ మహిళా సంఘాలకు సైతం ఆర్టీసీ అద్దె బస్సులు, ఇందిరమ్మ క్యాంటీన్ లు, ఫిష్ స్టాల్ లు కూడా ఇచ్చే లా మహిళలను ఆర్థిక స్వావలంబన చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరిని భాగస్వామ్యులను చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జీహెచ్ ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, పోలీస్, హైడ్రా డిపార్ట్‌మెంట్ లు సమన్వయం చేసుకొని పని చేస్తున్నాయని పొన్నం స్పష్టం చేశారు. హైదరాబాద్ లో గతంలో ఉన్న డ్రైనేజీ సిస్టమ్ పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా పెంచుతున్నామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>