పోలీసుల వ్యవహారశైలిపై ప్రజావాణిలో మహేందర్ ఫిర్యాదు

కలం, గంగాధర: జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లె గ్రామానికి చెందిన జర్నలిస్టు జంగిలి మహేందర్ (Journalist Mahender) తనకు జరిగిన అన్యాయంపై ప్రజావాణి అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో గంగాధర పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఎస్ఐ స్వరూప్ రాజ్ తనపై తప్పుడు కేసులు నమోదు చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడి, కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. గతంలో గంగాధర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన అప్పటి ఎస్సై స్వరూప్ రాజ్ ఆయన డ్రైవర్ కలిసి తనపై తప్పుడు కేసు నమోదు చేయించారని ఆరోపించారు. తన చెల్లెలి రిసెప్షన్‌కు సైతం హాజరుకాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యవహారం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం సంబంధిత ఫిర్యాదుదారు అయిన కానిస్టేబుల్ సుందరగిరి శ్రీనివాస్ తమ ఫిర్యాదు తప్పుగా నమోదైందని, ఎస్సై ఆదేశాల మేరకే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఎస్సై స్వరూప్ రాజ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, న్యాయస్థానాల్లో సాధించిన తీర్పుపై, సంబంధిత అధికారులపై వచ్చిన ఆరోపణలు, RTI ద్వారా అందిన సమాచారం, కేసుకు సంబంధించిన తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సమగ్రంగా పరిశీలించాలని కోరారు.

సంబంధిత పోలీస్ అధికారుల పాత్రపై ఉన్నతాధికారుల ద్వారా నిష్పక్షపాత విచారణ జరిపించి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జంగిలి మహేందర్ ప్రజావాణి అధికారులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరెవరికీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదుపై ప్రజావాణి అధికారులు స్పందించి, న్యాయపరమైన మరియు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని బాధితుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>