కలం, ఖమ్మం బ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలని బీజేపీ జాతీయ నాయకులు, తమిళనాడు రాష్ట్ర సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా (Khammam), వైరా శాస్త్రి నగర లోని షిరిడీ సాయి మందిరంలో జరిగిన 17 వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలవాలని, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆ సాయినాథుడిని వేడుకున్నట్లు తెలిపారు. అలాగే యాంత్రిక జీవనంలో ఆధ్యాత్మికత చింతన మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందని, ఇలాంటి వార్షికోత్సవాలు భక్తి భావాన్ని పెంపొందిస్తాయని ఆయన కొనియాడారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన భక్తులకు వడ్డించారు.

