కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువు వరద ప్రవాహంలో సాహసోపేతంగా సహాయక చర్యలు చేపట్టిన ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది (Bethupalli Rescue Staff) సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విధుల్లో నిబద్ధత చాటుకున్న రెస్క్యూ సిబ్బందిలో ఇండ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లతో పాటు స్థలాలు కూడా మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలను కాపాడిన రెస్క్యూ సిబ్బందికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి భరోసా కల్పించారు. మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

