కలం/ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలోనీ పాలేరు, మధిర నియోజకవర్గాల్లోని పలు వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి పొంగులేటి మాధురీ రెడ్డి (Ponguleti Madhuri). ఆదివారం ఆమె ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఐకేపీ మహిళా సంఘాలు, ఆశా వర్కర్లతో కలిసి కేక్ కట్ చేశారు. మాధురీ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. అనంతరం ఖమ్మం టీఎన్జీఓస్ భవన్‌లో మహిళా ఉద్యోగుల సేవలను కొనియాడారు. మహిళ ఉద్యోగాలతో సరదాగా ఆటల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆమె (Ponguleti Madhuri) పలు వివాహ వేడుకలకు హాజరై వధూవరులను దీవించారు. పైనంపల్లిలో మారగాని ఉపేందర్ గౌడ్ కుమారుడి వివాహం, ఏదులాపురంలో ఓరుగంటి పిచ్చిరెడ్డి కుమారుడి వివాహం, యర్ర ఉపేందర్ రెడ్డి కుమారుడి రిసెప్షన్, ఖమ్మంలో బండి శ్రీనివాసరావు కుమారుడి వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. మోహన్ రెడ్డి గృహ ప్రవేశ వేడుకకు హాజరయ్యారు. అలాగే ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో బొగ్గుల నరేంద్ర రెడ్డి కుమారుడి అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని దీవించారు.
Read Also: మహిళా పోలీసుల సేవలు భేష్: ఎస్పీ రోహిత్ రాజ్
Follow Us On: X(Twitter)

