గుర్తులు తారుమారు.. నిలిచిన పోలింగ్..!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ వ్యాప్తంగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల హడావుడి నెల‌కొంది. మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల నుంచే పోలింగ్ ప్రారంభ‌మైంది. దాదాపు అన్ని చోట్లా పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. అయితే మహబూబ్‌నగర్‌ (Mahabubnagar) లోని ఓ పోలింగ్ కేంద్రంలో గుర్తులు తారుమారు కావ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ప‌ట్ట‌ణంలోని 45వ డివిజన్‌లో ఉన్న 5వ పోలింగ్ కేంద్రంలో అభ్య‌ర్థుల గుర్తులు తారుమార‌య్యాయి. ఇది గుర్తించిన‌ అధికారులు పోలింగ్ నిలిపివేశారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థులు ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. ఈ స‌మ‌స్య‌ను ఎంత సేప‌ట్లో ప‌రిష్కరిస్తార‌న్న‌ది తెలియ‌డం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>