కలం, వెబ్ డెస్క్: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసుకు (Moinabad Farmhouse Drugs Case) సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో తాజాగా డ్రగ్స్ కేసును అన్ని కోణాల్లో విచారించేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మొత్తం 9 మంది అధికారుల బృందం ఈ కేసును విచారించనున్నది. ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరగనున్నది. ఈ కేసుకు సంబంధించి మూడు నెలల కాలవ్యవధిని కూడా విధించారు. దర్యాప్తును పూర్తి చేసి 3నెలల్లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ప్రభుత్వం సిట్‌ను ఆదేశించింది. కేసు మూలాలను పరిశీలించడంతోపాటు, నేరం జరగడానికి సంబంధించిన అన్ని అంశాలను విచారించనున్నారు.
సిట్ టీమ్ లో ఉండే అధికారులు వీళ్లే..
1. యోగేష్ గౌతమ్, ఐపీఎస్, డీసీపీ, చేవెళ్ల
2. ఎం రవీందర్ రెడ్డి, గ్రూప్ కమాండర్, గ్రేహౌండ్స్
3. సీహెచ్ శిరీష, డీసీపీ, షాద్‌నగర్
4. బుచ్చయ్య, డీఎస్పీ, ఈగల్ ఫోర్స్
5. హరీశ్‌చంద్ర రెడ్డి, డీఎస్పీ, ఈగల్ ఫోర్స్
6. వై మల్లికార్జునరెడ్డి, ఎస్‌హెచ్‌వో, మోయినాబాద్ పోలీస్ స్టేషన్ (విచారణ అధికారి)
7. కోటేశ్వర రావు, మోకిలా పోలీస్ స్టేషన్ ఎస్సై
8. వెంకన్న,మొయినాబాద్ పీఎస్, ఎస్సై
9. సదాత్ అలీ, ఎస్సై, శంషాబాద్
Read Also: ఐ వాంట్ నయనతార.. ఏఐఏడీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

