Mobile Popup Ad
Mobile Popup Ad

చల్లపల్లి పోలీసుల తనిఖీలలో భారీగా గంజాయి పట్టివేత

కలం, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లా చల్లపల్లి (Challapalli) పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన తనిఖీలలో 10.8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేగంగా పారిపోతుండగా వారి బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాయపడగా, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠా గురించి ఆరా తీస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>