Mobile Popup Ad
Mobile Popup Ad

గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో మద్యం పట్టివేత

కలం, మెదక్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టడానికి ముందస్తుగా మద్యం పంపిణీకి ప్లాన్ చేసుకుంటున్నారు నాయకులు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ (Gaddapotharam Municipality) పరిధి చెట్ల పోతారం వద్ద మారుతి స్విఫ్ట్ కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యంను పోలీసులు పట్టుకున్నారు. ఆలేటి వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి వైన్స్ షాపులో కొనుగోలు చేసి తరలిస్తున్న రూ. 1,14,048 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని కార్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు ఐడీఏ బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>