చేతులెత్తేసిన సీఎం రేవంత్: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: కరువు రాగానే సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao)  మండిపడ్డారు. చేతగాని ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. అసమర్థుడికి అధికారం అప్పగిస్తే.. ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా ఉందన్నట్లుగా రేవంత్ తీరు ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చాయన్నారు. రైతులు, ప్రజలకు భరోసా ఇవ్వడం మానేసి.. తాగు నీళ్లు కూడా దొరకవని భయపెట్టడమేంటన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ సీఎంగా ఉంటే.. కరెంట్ కోతలు నివారించి, కరువు ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకునేవారని గుర్తు చేశారు.

ఆరు నెలల నుంచి ఏం చేశారు..?

ఎల్ నినో కారణంగా కరువు వస్తుందని ఆరు నెలలుగా చెబుతూనే ఉన్నామని హరీశ్ రావు తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లను ఎందుకు ఎత్తిపోయలేదన్నారు. బొగ్గు నిల్వలు లేవని.. కరెంట్ సంక్షోభం వస్తుందని ఎంత మొత్తుకున్నా.. నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయిస్తూ కూర్చున్నారంటూ ధ్వజమెత్తారు. ఎల్ నినో ప్రపంచ సమస్య అయితే.. పక్కనే ఏపీలో ఎందుకు కరువు లేదో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బియ్యం ధరలు అడ్డగోలుగా పెరుగుతుంటే.. అది తన ఘనతే అని చెప్పుకోవడం సీఎంకే చెల్లిందన్నారు. తన ఎత్తు గురించి మాట్లాడినంత మాత్రాన ప్రాజెక్టుల్లో నీళ్లు పెరగవని విమర్శించారు. ఇప్పటికైనా కరువుపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>