అమరవీరులకు నివాళి.. రక్తదానంతో ప్రాణదానం

కలం, ఆదిలాబాద్‌: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను(Police Martyrs Week) పురస్కరించుకుని ఆదిలాబాద్‌ జిల్లా పోలీసుల(Adilabad Police) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి  విశేష స్పందన లభించింది. ప్రజలు, యువత, మహిళలు, పోలీసు సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మొత్తం 853 యూనిట్ల రక్తాన్ని దానం(Blood Donation) చేశారు. జిల్లా పోలీసుల చరిత్రలో ఈ కార్యక్రమం ప్రత్యేక గుర్తింపు పొందేలా భారీ సంఖ్యలో రక్తదాతలు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం చేసిన వారిని ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రాణాపాయంలో ఉన్నవారికి అండగా నిలవాలనే సందేశాన్ని చాటారు. ప్రమాద బాధితులు, శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులు, ఇతర అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి రక్తం ఎంతో కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆరోగ్యపరంగా అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొని సామాజిక బాధ్యతలో తమ భాగస్వామ్యాన్ని చాటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>