అరుదైన దృశ్యం.. ఆరిపోకుండా వెలుగుతున్న అఖండ దీపం

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని పాత చర్ల పెద్ద చెరువు ప్రాంతం వద్ద అరుదైన, అద్భుతమైన దృశ్యం చోటుచేసుకుంది. దేవి శరన్నవరాత్రుల వేడుకల ముగింపు సందర్భంగా నిమజ్జనం చేసిన అమ్మవారి అఖండ దీపం, నీటిలోనూ ఆరిపోకుండా నిరంతరం వెలుగుతుండటం (Cherla Akhand Jyothi) స్థానికంగా తీవ్ర విస్మయాన్ని, భక్తిభావాలను రేకెత్తిస్తోంది. సాక్షాత్తూ ఆదిపరాశక్తి దుర్గమ్మే ఈ రూపంలో వెలుగొందుతోందని భావిస్తున్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో పాత చర్ల పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి.

​పాత చర్లలో దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి 12 గంటల సమయంలో అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ నిమజ్జన క్రతువులో భాగంగా అమ్మవారి అఖండ దీపాన్ని చెరువులో వదిలారు. సాధారణంగా నీటిలో వదిలిన దీపాలు వెంటనే ఆరిపోవడం సహజం. అయితే, మరుసటి రోజు శుక్రవారం మధ్యాహ్నం అటుగా వెళ్లిన స్థానికులు చెరువులో దీపం ఇంకా వెలుగుతూనే ఉండటాన్ని గమనించి ఆశ్చర్యపోయారు.

​నీటిపై చెక్కుచెదరని కాంతులతో అఖండ దీపం వెలుగుతున్న ఈ అరుదైన వార్త క్షణాల్లో చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. దీంతో ఈ దివ్య దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పెద్ద చెరువు వద్దకు భారీగా పోటెత్తారు. దీపం వెలుగుతుండటాన్ని అమ్మవారి మహిమగా, దివ్య స్వరూపంగా కొలుస్తూ భక్తులు భక్తిపారవశ్యంతో మురిసిపోతున్నారు. పాత చర్ల పరిసర ప్రాంతాలన్నీ “జై దుర్గమ్మ.. జై జై దుర్గమ్మ” నామస్మరణతో మార్మోగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>