కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) చెక్ పోస్ట్ వద్ద గోవులను వధ శాలకు తరలిస్తున్న కంటైనర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ కంటైనర్ లో సుమారు 70 ఆవులు ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్ఘడ్ నుంచి భద్రాచలం మీదుగా హైద్రాబాద్ వధశాలలకు ఆవులను తరలిస్తున్నట్లు పోలీసుల విచారణ లో తేలింది. ఆవులు ఎవరి దగ్గర కొన్నారు. ఈ నేరం లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉంది వంటి విషయాలు తెలియాల్సి ఉంది. కాగా పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.


