కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సిట్ విచారణ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ భవన్, మినిస్టర్స్ క్వార్టర్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద రేవంత్ (Revanth Reddy) దిష్టి బొమ్మకు మెడలో పేగులు వేసి నిరసన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీఎం రేవంత్ ఇంటికి వెళ్లే మూడు దారుల వద్ద భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Follow Us On: Youtube


