కలం, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్ (Epstein Files) మరోసారి కలకలం సృష్టించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్‌ను అమెరికా ప్రభుత్వం దఫాదఫాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలో శనివారం మరోసారి ఎప్స్టీన్ ఫైల్స్‌ను సుమారు లక్షకు పైగా పత్రాలు, ఫొటోలను పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి రిలీజ్ చేసింది. ఇందులో ట్రంప్ పేరు కొన్ని వందల సార్లు ప్రస్తావించింది. అలాగే బిల్‌గేట్స్, మస్క్ పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఇటీవలే న్యూయార్క్‌కు మొదటి ముస్లిం మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ అమ్మ, భారతీయ దర్శకురాలు మీరా నాయర్ పేరు కూడా ఉంది. ప్రస్తుత ఎప్స్టీన్ ఫైల్స్‌లో రాజకీయ, సినీ, వ్యాపార వేత్తలతోపాటు క్రీడా దిగ్గజాల పేర్లు ఉండడం గమనార్హం.
సచిన్, మెస్సీ, బెక్‌హామ్:
భారత క్రికెట్ దిగ్గజం టెండూల్కర్ (Sachin Tendulkar)తో పాటు ఫుట్‌బాల్ లెజెండ్స్ డేవిడ్ బెక్‌హామ్, లియోనల్ మెస్సీ పేర్లు ఎప్స్టీన్ ఫైల్స్‌లో కనిపించాయి. వీళ్ల పేర్లు ఎప్స్టీన్ ఫైల్స్ (Epstein Files)లోని ‘మోస్ట్ అడ్మైర్డ్’ విభాగంలో ఉన్నాయి. కాగా, ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా ఆటగాడు మెస్సీ (Lionel Messi) ఇటీవల భారత పర్యటనకు వచ్చి, హైదరాబాద్‌ను కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. ఇక, ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్, మెస్సీ కలసి ఇంటర్ మియామి క్లబ్ తరఫున ఫుట్‌బాల్ ఆడారు.
మైఖేల్ జోర్డాన్, టైగర్ వుడ్స్:
వీళ్లిద్దరూ బాక్సెట్ బాల్, గోల్ఫ్‌లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) అని పేరు పొందిన ఆటగాళ్లు. ఇందులో టైగర్ వుడ్స్ పేరు ఎప్స్టీన్ ఈ మెయిల్స్‌లో ఉన్నట్లు తేల్చారు. ఇక, జోర్డాన్ పేరు.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ప్రెసిడెన్షియల్ మెడల్ తీసుకుంటున్నప్పుడు, ఎప్స్టీన్ సమక్షంలో ఉన్నట్లు పేర్కొన్నారు.
‘ఎప్స్టీన్ ఫైల్స్’లో పేరున్నంత మాత్రాన వారందిరీకీ ‘ఎప్స్టీన్’ నేరాలలో భాగం ఉన్నట్లు కాదని, అమెరికా ప్రభుత్వ స్పష్టం చేసింది. కాగా, అమెరికా సమీపంలోని ఓ దీవిలో మైనర్లు, మహిళలను పావుగా వాడుకొని వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులతో ఎప్స్టీన్ అనే వ్యాపారవేత్త తనకు కావాల్సిన పనులు చేయించుకున్నట్లు వెల్లడవడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Read Also: టీ20 వరల్డ్‌కప్ 2026: పాకిస్థాన్ ఎంట్రీపై ఉత్కంఠ
Follow Us On : WhatsApp


