ఖానాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల అభివృద్ధికి రూ.11.90 కోట్లు

కలం, ఖానాపూర్: ఖానాపూర్ (Khanapur) పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11.90 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (MLA Vedma Bhojju) మంగళవారం తెలిపారు. ఈ నిధులతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, విద్యా సదుపాయాల మెరుగుదలకు అవకాశం కలగనుందని, తద్వారా విద్యార్థినులకు మెరుగైన వాతావరణంలో విద్యనభ్యసించే సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

బాలికల విద్యకు ప్రోత్సాహం అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఈ నిధుల మంజూరు దోహదపడనుందని అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేస్తున్న కృషిలో భాగంగా ఈ నిధులు మంజూరు కావడం పట్ల విద్యార్థినులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>