సమన్వయంతో గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ రాజర్షిషా

కలం, ఆదిలాబాద్: యువత భవిష్యత్తుకు పెను ముప్పుగా విస్తరిస్తున్న గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ తో కలిసి గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి రహిత జిల్లాగా తీర్చి దిద్దేందుకు, సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి భూతాన్ని అంతం చేసేందుకు అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, అటవీ, వ్యవసాయ శాఖలు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలు, సరిహద్దు తనిఖీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందితే తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిహెమ్హెచ్ఓ సాధన, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆహార భద్రత అధికారిణి బి.ప్రత్యూష, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>