రాయ‌దుర్గంలో బైక్ రేసింగ్‌ల‌పై పోలీసులు సీరియ‌స్‌

క‌లం, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్‌(Hyderabad)లో నైట్ లైఫ్ క‌ల్చ‌ర్ విస్త‌రిస్తోంది. ఇంత‌కు ముందు తిండి, తిరుగుళ్ల‌కే ప‌రిమిత‌మైన ఈ సంప్ర‌దాయం ఇప్పుడు బైక్ రేసింగ్‌(Bike Racing)ల పేరుతో కొత్త రూపు దాల్చుతోంది. రాయ‌దుర్గం(Raidurgam), హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో వీకెండ్స్‌లో యువ‌త హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. రోడ్ల‌మీద గుంపులుగా చేర‌డం, బైక్‌, కార్ రేసింగ్‌లు వంటివి చేస్తున్నారు. ప్ర‌తి వారాంతంలో ఈ తంతు కామ‌న్‌గా న‌డుస్తోంది. దీంతో ప్ర‌మాదాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. న‌గ‌రంలో హైటెక్‌సిటీ, రాయ‌దుర్గంతో పాటు మ‌రికొన్ని చోట్ల ఏక‌కాలంలో త‌నిఖీలు చేప‌ట్టారు. వాహనదారులను నిలిపి ప‌త్రాలు త‌నిఖీ చేశారు. నైట్ లైప్ పేరుతో విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తిస్తూ, బైక్ స్టంట్స్ చేస్తే ఊరుకునేది లేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>