Mobile Popup Ad
Mobile Popup Ad

జగిత్యాల జిల్లాలో ఆటో బోల్తా: విద్యార్థులకు గాయాలు

కలం, వెబ్​ డెస్క్​ : జగిత్యాల జిల్లా (Jagtial District)లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో మల్లాపూర్ మండలంలోని మోడల్ స్కూల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసి, గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>