కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై (Bandi Bhagirath) నమోదైన పోక్సో (POCSO) కేసు తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో బండి భగీరథ్ తాజాగా సిట్ (SIT) అధికారులకు ఓ లేఖ రాశారు. శుక్రవారం విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని, పోలీసుల దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆ లేఖలో స్పష్టం చేశాడు.
అన్ని ఆధారాలతో వస్తా
తన వద్ద కీలక ఆధారాలున్నాయని, ఈ మేరకు మే 15న విచారణకు హాజరవుతానని పేర్కొన్నాడు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణపై మరింత ఉత్కంఠ నెలకొంది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసు కావడంతో ప్రతి పరిణామం సంచలనంగా మారుతోంది. సిట్ అధికారులు ఈ లేఖపై ఎలా స్పందిస్తారు? సమయం ఇస్తారా..? లేక చట్టపరమైన చర్యలకు దిగుతారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

