కలం, నిజామాబాద్ బ్యూరో : వికలాంగుల జీవితాల్లో కొత్త ఆశలు నింపే లక్ష్యంతో గత కొన్ని రోజుల క్రితం బాన్సువాడ పట్టణానికి చెందిన యాదగిరి, కరణ్, మహమ్మద్‌లకు అందించిన కృత్రిమ అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy) వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా కృత్రిమ అవయవాల పనితీరును స్వయంగా పరిశీలించి, వాటిని వినియోగించడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో కూడా అవసరమైన సహకారం అందిస్తానని వారికి భరోసా కల్పించారు.
భాస్కర్ రెడ్డి తమ ఇంటికి రావడంతో యాదగిరి, కరణ్, మహమ్మద్ కుటుంబ సభ్యులు ఆనందంతో స్వాగతం పలికారు. తమ జీవితాల్లో మళ్లీ ఆశను నింపి, కొత్త జీవితాన్ని అందించినందుకు భాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

