కలం, వెబ్ డెస్క్ : దశాబ్ధ కాలంలో మొబైల్ ఫోన్లు సాధారణ కమ్యూనికేషన్ పరికరాల స్థాయి నుంచి సుపరిపాలనను ప్రజల వద్దకు చేర్చే విధంగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. ఢిల్లీ వేదికగా ప్రారంభమైన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ –2026 (India Mobile Congress) సదస్సును ప్రారంభించిన ఆయన ప్రసంగించారు. భారత టెలికాం రంగం కేవలం నెట్ వర్క్ లు, స్పెక్ట్రమ్, ఇంటర్నెట్ వేగాకిఏ పరిమితం కాలేదన్నారు. ప్రభుత్వ సేవలు, సుపరిపాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
ఇదే వేదికపై 2022 లో దేశంలోని 5 జీ నెట్ వర్క్ సేవలు ప్రారంభించామని మోదీ (PM Modi) గుర్తు చేశారు. ఇప్పుడు దేశంలోని ప్రతి జిల్లాకు 5 జీ సేవలు విస్తరించాయని.. 5.5 లక్షలకు పైగా 5జీ బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. 2022 సంవత్సరంతో పోల్చుకుంటే ఇంటర్నెట్ స్పీడ్ పది రేట్లు పెరిగిందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ సాంకేతిక రంగానికి భారత దేశం వేదిక కావాలని.. మొబైల్ టెక్నాలజీని శాసించాలని మోదీ ఆకాంక్షించారు.
Also Read : ఢిల్లీ ప్రొటెస్ట్‌లో పొలిటికల్ హీట్: రాహుల్ ప్రవర్తనపై వివాదం!
Follow Us On: Youtube

