ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిర్మల్‌లో కాంగ్రెస్‌ నిరాహార దీక్ష

కలం, నిర్మల్‌: దేశంలో కోట్లాది మంది ఓటర్ల ఓట్లను తొలగించి, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ నిర్మల్‌ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు ఆరోపించారు. ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ఒకరోజు నిరాహార దీక్ష (Hunger Strike) చేపట్టారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు నినాదాలు చేశారు. శ్రీహరి రావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓటర్ల సమగ్ర సర్వే పేరుతో ఎస్‌ఐఆర్‌ను అమలు చేస్తూ ఓటర్ల జాబితాలో భారీగా కోత పెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరి దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>