12 ఏళ్ల పాలనలో ఎన్నో మార్పులు: ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్: ఎన్డీయే అధికారంలోకి వచ్చి పుష్కర కాలం పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) ‘ఎక్స్’‌లో పోస్ట్ చేశారు. ‘గత 12 ఏళ్లలో భారతదేశం ఎన్నో మార్పులను చూసింది. పేదలు, అణగారినవర్గాల సంక్షేమ రూపురేఖలే మారిపోయాయి. అంత్యోదయ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, దశాబ్ధాలుగా సమాజానికి దూరంగా ఉండిపోయిన వర్గాలకు కూడా ప్రయోజనాలు దక్కేలా చర్యలు తీసుకుంటూ వస్తున్నాం.

జనదన్ బ్యాంక్ ఖాతాలు తెరిపించడం నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ వరకు, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ఎన్నెన్నో విశిష్ట కార్యక్రమాలు, పథకాలను అమల్లోకి తీసుకొచ్చాం. ప్రతి వ్యక్తికి గౌరవం, అవకాశం దక్కడమే లక్ష్యంగా వీటన్నింటి ఉద్దేశం’ అని పేర్కొన్నారు.

Read Also: నేడు ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి సమావేశం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>