కలం వెబ్ డెస్క్ : భారత సంస్కృతి(Indian Culture)కి ప్రతీక సోమనాథ్ ఆలయం(Somnath Temple) అని ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) అన్నారు. సోమనాథ్ ఆలయంపై దండయాత్రకు 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్మరించుకున్నారు. ఈ ఆలయంపై 1026 జనవరిలో గజిని మహమ్మద్ దండయాత్ర చేశాడు. జనవరితో ఈ దండయాత్రకు వెయ్యి సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై ఓ సుధీర్ఘ వ్యాసాన్ని రాశారు. శతాబ్దాల పాటు ఎన్నో దాడులు ఎదుర్కొన్నా సోమనాథ్ ఆలయం ఇప్పటికీ నిలిచి ఉందని, ఇది భారతదేశం అమర ఆత్మకు చిహ్నమని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయం కథ కేవలం ఒక దేవాలయం గురించి మాత్రమే కాదని, లక్షలాది మంది భారత మాత బిడ్డల అపారమైన ధైర్య సాహసాల మిళితం అని భారత సంస్కృతికి ప్రతీక సోమనాథ్ ఆలయం మోడీ పేర్కొన్నారు. దేశ సంస్కృతి, నాగరికతను కాపాడుకున్న ఆ అసంఖ్యాకమైన వారి అవిశ్రాంత కృషి, ధైర్యమే సోమనాథ్‌ను నిలబెట్టిందని ఆయన కొనియాడారు.


