ప్రధాని వ్యాఖ్యల ప్రభావం.. ఇబ్బందులలో స్వర్ణకారులు

కలం, వెబ్ డెస్క్ : బంగారం కొనుగోళ్లపై (Gold Sales)  ప్రధాని చేసిన వ్యాఖ్యల ప్రభావం స్వర్ణకారులపై (Goldsmiths) పడింది. ఇప్పటికే బంగారం ధరలు భారీగా హెచ్చు తగ్గులు ఎదుర్కొంటుండటంతో ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో నగల దుకాణాలు, స్వర్ణకారుల వద్ద పనులు గణనీయంగా తగ్గిపోయాయి. పనుల లేమితో స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ ఉపాధిపై ఆధారపడే కార్మికులకు జీవనోపాధి కష్టంగా మారిందని చెబుతున్నారు. ప్రభుత్వం తమకు ఉపాధి భరోసా కల్పించాలని, స్వర్ణకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. బంగారం వ్యాపారం మళ్లీ పుంజుకునేలా చర్యలు అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.

Read Also: హరీశ్ రావు ఆధ్యాత్మిక బాట వెనుక ఆంతర్యమేమిటి!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>