విశాఖ త్రిశూలం వెనుక సోమనాథ్ స్ఫూర్తి: లోకేశ్

కలం, వెబ్ డెస్క్ : భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే మరో కీలక ఘట్టం విశాఖలో ఆవిష్కృతమైంది. కైలాసగిరి కొండపై 65 అడుగుల ఎత్తైన మహా త్రిశూలాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందిస్తూ, గుజరాత్‌లోని పవిత్ర సోమనాథ్ దేవాలయం (Somnath Temple) పునరుద్ధరణకు రేపు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక స్ఫూర్తి పెరుగుతోందని అన్నారు.

సోమనాథ్ సముద్ర తీరంలో కనిపించే శక్తి, విశాఖ కైలాసగిరి తీర ప్రాంతంలోనూ ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు. విశాఖ కూడా సముద్రాన్ని ఆనుకుని ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తోందని లోకేశ్ తెలిపారు. సోమనాథ్ నుంచి విశాఖ వరకు భారత ఆధ్యాత్మిక వారసత్వం మనల్ని మరింత బలంగా, సంస్కృతి, విశ్వాసం, మంచి విలువలతో ముందుకు నడిపిస్తుందని లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ‘ఓం నమః శివాయ’  అంటూ ఆధ్యాత్మిక భావాన్ని వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>