కలం, వెబ్ డెస్క్: న్యూఢిల్లి లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ‘దీపావళి మిలన్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. మీడియా కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో మోదీ మాట్లాడుతూ.. భారత దేశంలో టెక్నాలజీ వినియోగం పెరిగిందని అన్నారు.
భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే తన లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. జర్నలిస్టులతో తనకు సుదీర్ఘకాలం అనుభవం ఉందన్నారు. మీడియాకు ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏది లేదని కొనియాడారు. సంక్షోభాలు, విపత్తుల సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవడానికి ఎంత దూరమైన ప్రయాణిస్తారని మోదీ చెప్పారు.
బీజేపీలో చేరిన తొలినాళ్లలో మీడియా ఈవెంట్ల కోసం కూర్చీలు వేసేవాడినని మోదీ (PM Modi) గుర్తు చేసుకున్నారు. జర్నలిజంలో అనే మార్పులు వచ్చాయన్న ప్రధాని ఇప్పుడు అంతా సోషల్ మీడియా ద్వారానే తెలిసిపోతున్నాయన్నారు. గతంలో ఏ కార్యక్రమం జరిగినా పత్రికా ప్రకటన వెలువడిన తరువాతే తెలిసేదని.. ప్రస్తుతం ఇన్ స్టా రీల్స్ ద్వారానే ప్రతీది వేగంగా ప్రచారం అవుతుందని చెప్పారు.

