కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ డీఈఈ సత్యనారాయణ గౌడ్ (Satyanarayana Goud) పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు (ACB Raids) చేపట్టారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదులతో గురువారం ఉదయం ఆకస్మికంగా నాగర్ కర్నూల్ ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ సీఐ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం ఈ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భాగంగా కార్యాలయంలో పలు రికార్డులను అధికారులు పరిశీలించారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సత్యనారాయణ గౌడ్ (Satyanarayana Goud) ఆధ్వర్యంలో జరిగిన పనుల ఫైళ్ల వివరాలను తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 బృందాల్లో ఒకటి నాగర్ కర్నూల్లో ఆయన విధులు నిర్వహిస్తున్న కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. సత్యనారాయణ గౌడ్ సొంత నివాసమైన వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం సోలిపూర్ లోనూ మరో బృందం తనిఖీలు చేపట్టింది.
Also Read : వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow Us On : WhatsApp

