కలం, ఇంద్రవెల్లి: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) అన్నారు. ఇంద్రవెల్లి (Indervelly) మండల కేంద్రంలో గురువారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 883 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చి కొత్త రేషన్ కార్డులు అందించిందన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోనే అత్యధిక సంఖ్యలో రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, తహశీల్దార్ ఎంపీడీఓ, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

