ప‌వ‌న్ క‌ల్యాణ్ గారూ కాపాడండి.. కువైట్‌లో పిఠాపురం మ‌హిళ ఆవేద‌న‌

క‌లం, వెబ్ డెస్క్‌: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త‌త‌లు రోజురోజుకీ తీవ్ర‌మ‌వుతున్నాయి. ఉపాధి నిమిత్తం గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లిన ల‌క్ష‌లాది మంది అక్క‌డే చిక్కుకొని ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీకి చెందిన ఓ మ‌హిళ సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను విడుద‌ల చేసింది. కువైట్‌లో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని. త‌న‌ను ఏపీకి తీసుకురావాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను వీడియో ద్వారా రిక్వెస్ట్ చేసింది. డిప్యూటీ సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురం (Pithapuram)లోని రథాలపేట గ్రామానికి చెందిన దాకే కుమారి వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

దాకే కుమారి (Dake Kumari) ఉపాధి నిమిత్తం నాలుగు నెల‌ల క్రితం కువైట్ వెళ్లింది. ఆమె భ‌ర్త‌, ముగ్గురు పిల్ల‌లు ఇక్క‌డే ఉంటున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది రోజుల నుంచి కువైట్‌లో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధానికి సంబంధించిన ఘ‌ట‌న‌ల‌ను వీడియోలో చూపిస్తూ బాంబ్ బ్లాస్ట్‌లు భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాయ‌ని తెలిపింది. ఇప్ప‌టికే చాలామంది ఇళ్ల‌కు వెళ్లిపోయార‌ని వెల్ల‌డించింది. త‌న‌ను ఏపీకి తీసుకురావాల‌ని సీఎం చంద్ర‌బాబు (Chandrababu), డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్‌ల‌కు కుమారి కోరింది. యుద్ధం నేప‌థ్యంలో త‌న కుటుంబ‌స‌భ్యులు, పిల్ల‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని వెల్ల‌డించింది. మ‌రి దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Read Also: టీడీపీ ఎమ్మెల్యే ఆదేశాల‌తో బీజేపీ నేత హౌస్ అరెస్ట్‌!

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>