కలం, వెబ్ డెస్క్ : టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు. టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ అద్భుత విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న కుల్దీప్, తన చిన్ననాటి స్నేహితురాలు వంశీకతో (Vanshika) కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. వీరి వివాహ వేడుక మార్చి 14వ తేదీన ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో వైభవంగా జరగనుంది.
గత ఏడాది జూన్ 4న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, కుల్దీప్ (Kuldeep Yadav) అంతర్జాతీయ మ్యాచ్‌ల బిజీ షెడ్యూల్, టీ20 వరల్డ్ కప్ కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు భారత్ వరల్డ్ కప్ సాధించిన ఆనందంలో ఈ వేడుకను జరుపుకుంటున్నారు. కాన్పూర్‌లో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఈ జంట, ఇప్పుడు బంధుమిత్రుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు.
పెళ్లి వేడుకలు మార్చి 13 నుంచే ప్రారంభం కానున్నాయి. ముందుగా ముస్సోరీలో మెహందీ, సంగీత్ ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మార్చి 17వ తేదీన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘనంగా వివాహ విందు (రిసెప్షన్) ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు భారత క్రికెట్ జట్టు సభ్యులు, బీసీసీఐ ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
Read Also: టీం ఇండియాకు బీసీసీఐ భారీ నగదు బహుమతి.. ఎంతంటే?
Follow Us On: Instagram

