కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ మిలియన్ మార్చ్ నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ (Dilsukhnagar)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 20 వేల పోలీస్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేడు నిరసనలకు పిలుపునిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిర్లక్ష్యం చేస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌తో పాటు వయో పరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ముందస్తుగా దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. పలువురిని ముందస్తు అరెస్టులు చేశారు.
Read Also: కేంద్ర మంత్రులకు పొన్నం ప్రభాకర్ లేఖ
Follow Us On : WhatsApp

