Mobile Popup Ad
Mobile Popup Ad

టీడీపీ ఎమ్మెల్యే ఆదేశాల‌తో బీజేపీ నేత హౌస్ అరెస్ట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలోని క‌దిరి (Kadiri) నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం సంద‌ర్భంగా కూట‌మి మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. క‌దిరి ఎమ్మెల్యే, టీడీపీ నేత కందికుంట ప్ర‌సాద్‌ (Kandikunta Prasad) ఆదేశాలతో పోలీసులు బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి (Vishnuvardhan Reddy)ని అరెస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ రోజు ఉద‌యం త‌న అనుచ‌రుల‌తో నరసింహస్వామి రథోత్సవానికి వెళ్లేందుకు విష్ణువ‌ర్ధ‌న్ సిద్ధ‌మ‌య్యారు. అంత‌కు ముందే పోలీసులు ఆయ‌న ఇంటికి వ‌చ్చారు. రథోత్సవానికి వెళ్ల‌కూడ‌ద‌ని, హౌస్ అరెస్ట్ చేస్తున్నామ‌ని చెప్పారు. ఆయన రాకుండా ఉండాలని కందికుంట ప్రసాద్ ఆంక్షలు విధించినట్లు నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చించుకుంటున్నారు. రథోత్సవం వద్ద ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంద‌ని, ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు విష్ణువ‌ర్ధ‌న్‌ను అరెస్ట్ చేశారు.

దీనిపై ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ స్పందించారు. కదిరిలో (Kadiri) ఎలాంటి వివాదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అయిన తానే ర‌థం ఎక్క‌లేద‌ని, ఎమ్మెల్యే అనే హోదాను తాను చూపించుకోవ‌డం లేద‌ని, ఎంతో త‌గ్గి ఉంటున్నాన‌ని ప్ర‌క‌టించారు. చిన్న మ‌న‌స్త‌త్వం ఉన్న‌వాళ్లే వివాదం సృష్టిస్తున్నార‌ని, వారి సంగ‌తి దేవుడే చూసుకుంటాడ‌ని వెల్ల‌డించారు.

Read Also: ప‌వ‌న్ క‌ల్యాణ్ గారూ కాపాడండి.. కువైట్‌లో పిఠాపురం మ‌హిళ ఆవేద‌న‌

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>