కలం, వెబ్ డెస్క్: నిరుద్యోగం, అసమానతలు, దోపిడీకి వ్యతిరేకంగా దేశంలోని యువత చేస్తున్న ప్రజాస్వామ్య నిరసన గళాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరంకుశ చర్యలకు పాల్పడుతోందని కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతలో పెరుగుతున్న వ్యతిరేకతను చూసి బీజేపీ భయపడుతోందని, అందువల్లే సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) ఎక్స్ ఖాతాను నిలిపివేయించిందని ఆయన విమర్శించారు. ఇలాంటి నియంతృత్వ చర్యల ద్వారా యువత నిరసనలను నొక్కేయలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా వినిపిస్తున్న స్వరాలను బలవంతంగా అణచివేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికే పూర్తి విరుద్ధమని తన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నిరుద్యోగులపై ఓ లాయర్ చేసిన అనుచిత వ్యాఖ్యల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ పార్టీ పేరుతో తెరిచిన అకౌంట్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను నిలిపివేశారు.

