కలం, వెబ్ డెస్క్: ప్రపంచంలో రెండో అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి బెంగళూరు (Bengaluru) వేదికగా కాబోతుంది. న్యూ బెంగళూరు సిటీలో సుమారు రూ.943 కోట్లతో 80 వేల మంది ప్రేక్షకులు కూర్చునేలా దీన్ని నిర్మించబోతున్నట్లు డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వెల్లడించారు. ఇది కేవలం క్రికెట్ స్టేడియం మాత్రమే కాదు.. కర్ణాటక మౌలిక రంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే పెద్ద ప్రాజెక్ట్ అన్నారు. అత్యంత వేగంగా, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో దీన్ని నిర్మించబోతున్నట్లు వివరించారు.

